రేపు సలార్ ఫస్ట్ సాంగ్ రిలీజ్

-

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలు మరింత పెంచేసింది.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ ప్రమోషన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అప్డేట్ గురించి ఇవాళ ప్రకటన రానుంది. ఈనెల 22న సలార్ మూవీ విడుదల కానుండటంతో.. ఓవర్సిస్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిలీజ్ కి ముందే సెకండ్ ట్రైలర్ రిలీజయ్యే అవకాశముంది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news