మేం మళ్ళీ అధికారంలోకి వస్తాం.. అప్పుడు నా తడాఖా చూపిస్తా : అనిల్ కుమార్ యాదవ్

-

నేను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాది వైసిపి కాదు. నాది జగన్ పార్టీ. జగన్ ఎలా ఉంటే అలా ఉంటా. నేను కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నా. ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్ళను. త్వరలోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటా.

కానీ నన్ను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. ఎందరో మహామహులు జైలుకు వెళ్లారు. నేను జైలును చూసి భయపడను. జిల్లాలో శునకానందం పొందుతున్న కొందరు అధికారంలోకి వచ్చామని.. తమకు మించిన వీరులు లేరని అనుకుంటున్నారు. కానీ మేం మళ్ళీ అధికారంలోకి వస్తాం. అప్పుడు నా తడాఖా చూపిస్తా.. ఇచ్చింది డబుల్ గానే తిరిగి చెల్లిస్తాం అని అనిల్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news