రైతులకు ఇది పండుగ రోజు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లోకి రూ.1లక్షలోపు రుణం మాఫీ చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రూపాయి రూపాయి పోగు చేసి ఇచ్చిన మాట ప్రకారం.. రైతు రునమాఫీ చేసామని తెలిపారు. ఒకేసారి రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశామని తెలిపారు.