యూనిక్ ఐడీతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు

-

తెలంగాణ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీకి, రేషన్‌కార్డుకు లింకు పెట్టొద్దని అదేశాలు జారీ చేసింది. రేషన్‌కార్డు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్‌ను వర్తింపజేయాలని సీఎం అధికారులకు సూచించారు. స్కీమ్‌లో లబ్ధిదారులను గుర్తించి రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలోనే, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సపరేట్ నంబర్ ఇచ్చి, ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయనుండగా ఇప్పటికే రెండుసార్లు చెన్నైకి వెళ్లి అక్కడ స్కీమ్ అమలవుతున్న తీరును ఆఫీసర్లు అధ్యయనం చేశారు. స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. ట్రామా కేర్ ప్యాకేజీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news