రాష్ట్రంలో మూడోరోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

-

రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజున ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇవాళ కూడా తెల్లవారు జామునే ఐటీ బృందాలు నగరంలోని పలు చోట్ల దాడులకు దిగాయి. వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ, హోటల్‌ ఎట్‌ హోమ్‌, వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. నగరంలో జరుగుతున్న ఈ సోదాల్లో సుమారు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

తన నివాసం, సంస్థల్లో వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు చేయడంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పందించారు. గతంలో తన సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ సోదాలు నిర్వహించి.. ఎలాంటి అవకతవకలు లేవంటూ రెండు అవార్డులిచ్చిందని చెప్పారు. ఇప్పుడు కూడా మరోమారు అధికారులే అవార్డు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version