తెలంగాణలో ఆదాయ శాఖ అధికారుల దాడులు రెండోరోజు కొనసాగుతున్నాయి. సుమారు 70 బృందాలతో స్థిరాస్తి , హోటల్స్ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగిన వారి ఇల్లు , కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలో రెండోరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్సీహిల్స్లోని మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్దకు వచ్చిన ఐటీ అధికారులు.. ఆదాయపన్ను చెల్లింపు, వ్యయాలపత్రాలను పరిశీలిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని జేసీ బ్రదర్స్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. గడిచిన రెండు ఆర్ధిక సంవత్సరాల వ్యాపార, ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు స్థిరాస్తి , హోటల్స్ వ్యాపారాల్లో భాగస్వామ్యం అనుబంధ వ్యాపారాలు, బినామీలు, డైరెక్టర్లు, మేనేజిన్గ్ డైరెక్టర్లు , సీఈఓల ఇళ్లపైన సోదాలు కొనసాగుతున్నాయి.
కొన్ని చోట్ల సోదాలు చేస్తున్న రెండు మూడు ఐటీ బృందాలు ఇవాళ్టికి కొన్ని చోట్ల తనిఖీలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతుంటే.. మరోవైపు ఆ ప్రాంతంలోకి చేరుకున్న వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా.. ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.