ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

-

ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు దూకిస్తున్నది దక్షిణాది రాష్ట్రాలేనని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ శుక్రవారం ఓ కార్యక్రమంలో చెప్పడం పాత వాస్తవాన్ని మరోసారి ధ్రువీకరించినట్టయిందన్నారు.

‘ఇండియాలో 7 నుంచి 10 శాతం వృద్ధి సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఇంకా మెరుగైన ప్రగతి సాధించాలి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థను శరవేగంతో పరిగెత్తిస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా పది పన్నెండు రాష్ట్రాలు 10% వృద్ధి రేటుతో ముందుకు పోవాలి. ఇతర రాష్ట్రాలూ వాటితో పాటు ప్రగతిపథంలో పయనిస్తే భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుంది,’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా ఇతర దక్షిణాది రాష్ట్రాలకున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతున్నాయని వెల్లడించారు.

 

కొత్త పరిశ్రమలు స్థాపన సహా అన్ని రకాల వ్యాపార, వాణిజ్య రంగాలకు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా అనువైన రాష్ట్రమని అనేక సర్వేలు ఇటీవల వెల్లడించాయి. కొత్త పెట్టుబడులకు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, వ్యాపారాలకు ఏపీ అత్యంత ప్రయోజనకరమైన రాష్ట్రమని కూడా ఈ అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఈ పెద్ద తెలుగు రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ, వ్యాపార సుస్థిరత నూతన పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని కూడా వార్తలొస్తున్నాయని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news