తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం హైదరాబాద్ లోని కవిత నివాసంలో తనిఖీలను చేపడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా కవితకు సంబంధించిన ఆడిటర్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కవిత కూడా ఈడీ కార్యాలయంలో అలాగే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చాలా సమాచారాన్ని సేకరించారు అధికారులు. ఈ కేసులో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.