దేనిని బేస్ చేసుకుని తై బంది ఇస్తారో చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

-

దేనిని బేస్ చేసుకుని తై బంది ఇస్తారో చెప్పాలి అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గ రైతులందరు యాసంగి పంట కోసం గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించాం.

ప్రత్యేకమైన ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక ద్వారా సాగుకు గోదావరి నీళ్లను తీసుకువచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో లాగా రైతులకు సాగు నీళ్లు వస్తాయ రావా అని ఆందోళన చెందుతున్నారు రైతులు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్కసారైనా అధికారులతో సమీక్షించారా..? అని ప్రశ్నించారు. గతంలో పూడుకుపోయిన కాలువలకు పూడిక తీసి సమృద్ధిగా నీళ్లు కాలువల ద్వారా పారించాం.  బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనాడు నీళ్లు రావటంలేదని అడిగిన దాఖలాలు లేవు. ఈరోజు దేనిని బేస్ చేసుకుని తైబంది ఇస్తామని అంటున్నారో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి.

ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఉన్నా ఇప్పుడు ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీళ్లు ఎందుకు రావటంలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. నియోజకవర్గంలో డీబీఎం 38, 40 ద్వారా 50 వేల ఎకరాల పై చీలుకు పంటలు సాగులో ఉండేవి. బోర్లు, బావులు ఉన్న రైతులు కాలువ ద్వారా వచ్చే నీళ్లు వాడొద్దని అంటున్నారు ఎందుకు.  పాఖాలకు నీళ్లు తీసుకువస్తే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామన్న నాయకులు ఈరోజు ఎక్కడికి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news