హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాదులో నిన్న సాయంత్రం నుంచి తగ్గిన వర్షం మళ్ళీ మొదలైంది. కోటి, నాంపల్లి, లకిడికపూల్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, కైరాతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావునగర్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృత్తమై ఉంది. ఇవాళ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
కాగా, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కాలేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీకి ఇను ఫ్లో 13,16,961 క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీనివల్ల గోదావరి ఉధృతి మరింత పెరుగుతోంది. ఏటూరు నాగారం, వాజేడు, మంగపేట, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాలకు ముంపు పొంచి ఉండటంతో… ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.