ప్రభుత్వ హెలికాప్టర్లలో దావత్‌లకు వెళ్తున్న మంత్రులు : జగదీశ్‌రెడ్డి

-

ఇప్పటివరకు తనను సస్పెండ్ చేస్తూ బులెటిన్ ఇవ్వలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీకి రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉందని ప్రశ్నించారు. తనను సస్పెండ్‌ చేసినట్లు బులెటిన్ ఇస్తే రానని.. ఏ కారణంతో సస్పెండ్ చేశారని నిలదీశారు. వారం నుంచి ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదని తెలిపారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోంద్న ఆయన.. పద్ధతి ప్రకారం నడవట్లేదని.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఇష్టాగోష్టిలో మాట్లాడారు.

“సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు. ఇప్పటికే సభాపతిని రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్టలా కనిపిస్తోంది. సస్పెన్షన్‌పై బులెటిన్ ఇవ్వాలి.. లేదంటే సభాపతిని కలుస్తాను. నేను కోర్టుకు పోతానన్న భయంతో బులెటిన్ ఇవ్వట్లేదు. మంత్రులు జవాబివ్వలేక – ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. మంత్రులు దావత్‌లకు కూడా ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారు. నిన్న జానారెడ్డి దావత్‌కు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లారు.” అని జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version