విద్యుత్ కొనుగోళ్ళు , కాళేశ్వరం ప్రోజెక్టుల విచారణ పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి…ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనా హామీల అమలు మరచి గత ప్రభుత్వాల పై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని ఆగ్రహించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వల్ల హామీల గురించి జనాలు మర్చిపోతారని ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు.. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయి ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ఆగ్రహించారు.
ఎన్నికల కోడ్ ముగిసాక హామీల అమలు పై ప్రజలు నిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల డ్రామాలు అన్నారు. కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారు.. నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు… నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది.. ప్రజలు మంచినీళ్ళ కోసం రోడ్లెక్కే పరిస్థితి కనిపిస్తోంది.. పదేళ్ళ క్రితం ఉన్న దుస్థితి మళ్ళీ వచ్చాయని నిప్పులు చెరిగారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది.. పత్తి విత్తనాల బ్లాక్ దందా పై ఓ మంత్రి పాత్ర ఉంది.. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్ఫష్టం చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.