లోక్‌సభ ఎన్నికల్లోపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి : జగ్గారెడ్డి

-

బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి రెడీగా ఉన్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోపు వారిని పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఇటీవలే బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీజేపీల అంతర్గత ఒప్పందం వల్లే పార్టీ మారినట్లు చెప్పారు.

మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి విలువలు లేవని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీ సీఎం జగన్‌కు రూ.వెయ్యి కోట్ల నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో ఇదే విషయం ప్రస్తావించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి మోదీ, కేసీఆర్‌ల దగ్గర వకాల్తా ఏమైనా తీసుకున్నారా? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.  లోక్‌సభ ఎన్నికల్లో 12- 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news