మల్లారెడ్డిపై ఐటీ దాడులను ఖండించిన జగ్గారెడ్డి !

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులను ఖండించారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మా కొట్లాట లోక కల్యాణం కోసమని.. బీజేపీ..trs కొట్లాట లోక వినాశనం కోసమని ఫైర్‌ అయ్యారు. మా అంతర్గత పంచాయతీ లోక కల్యాణం కోసం అని వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. మల్లారెడ్డి ఇప్పుడు పైసలు సంపాదించిండా ? టీడీపీ లో ఉన్నప్పటి నుండి సంపాదించాడన్నారు.

ఎనిమిది యేండ్లలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని.. 8 ఏండ్ల నుండి ఎందుకు దాడి చేయలేదని ఐటీపై ఆగ్రహించారు. దేవుళ్ళ కాలం లో కూడా క్యాసినో..క్లబ్బు లు ఉన్నాయని.. గోవా లో క్యాసినో ఫ్రీ అని నిప్పులు చెరిగారు. అక్కడ అధికారం లో ఉన్నది బీజేపీ నే కదా అని..మండిపడ్డారు. గోవా లో ఆడించేది మీరు..ఇక్కడ దాడులు చేసేది మీరే అంటూ బీజేపీ పై నిప్పులు చెరిగారు.