సీఎం ఆదేశాలతోనే ఓయూ వీసీ రాహుల్ టూర్ ను తిరస్కరిస్తున్నారు: జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్ ఆదేశాలతో వీసీ వ్యవహరిస్తున్నారని… రాహుల్ గాంధీ టూర్ ను తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావడాన్ని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓయూకు వస్తే తమ పాలన గురించి తెలుస్తుందని భయపడే ఓయూకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. చట్టపరంగా న్యాయపరిధిలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి వచ్చేలా ప్రయత్నిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

ఎనిమిదేళ్లుగా అపాయింట్ లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ప్రజలు అంటే భయమని… ప్రజలను చూస్తే కాళ్లు, చేతులు వణుకుతున్నాయని అన్నారు. ప్రభుత్వం, వీసీ ద్వారా అనుమతి రాకుంటే వేలమంది స్టూడెంట్స్ రాహుల్ గాంధీ వెంట వస్తారని… మేం వెనక్కి వెళ్లే ప్రసక్తేల లేదని… తప్పకుండా ఓయూకు వస్తామని స్పష్టం చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ హెచ్చరించారు. రాహుల్ గాంధీ విజిట్ తప్పకుండా ఉంటుందని…వెనక్కి తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి అన్నారు.