క్యాన్సర్ పేషెంట్ కి ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి

-

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఓ మహిళకు ఆర్థిక సాయం అందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళా గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్నారు. ఒకవైపు ఇద్దరూ ఆడపిల్లలను చూసుకుంటూనే మరోవైపు క్యాన్సర్ తో పోరాడుతుంది.

క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేందుకు వైద్యం కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేసింది. తన వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి మంగళవారం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమని ఆరోగ్య పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. అనంతరం ఆమె వైద్యం కోసం భారీ ఆర్థిక సాయం చేశారు. రూ.10లక్షలను బాధితురాలుకి ఇచ్చి మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఆమని క్యాన్సర్ ను జయింతి తిరిగి పూర్వ స్థితికి రావాలని కోరుకున్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news