తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మేరకు పొత్తులపై చర్చలు కూడా జరిపారు. అందులో భాగంగానే బీజేపీ 109 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. . ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఇక నిన్న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగించారు. నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టమన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
జనసేన స్థానాలు
- 1. కూకట్‌పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
- 2. తాండూరు – నేమూరి శంకర్ గౌడ్,
- 3. కోదాడ – మేకల సతీష్‌రెడ్డి,
- 4. నాగర్‌కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్,
- 5. ఖమ్మం – మిర్యాల రామకృష్ణ,
- 6. కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు,
- 7. వైరా (ఎస్టీ) – డాక్టర్ తేజువత్ సంపత్ నాయక్,
- 8. అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి