ప్రమాదకరంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్!

-

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరంందుకున్నాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉప్పొంగుతోంది. భారీ వర్షాలతో ప్రజాజీవనం స్తంభించింది. ఎక్కడికి అక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలోని మూసారంబాగ్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. హిమాయత్ సాగర్ నుంచి నీళ్లు వదలడంతో మూసిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

ప్రస్తుతం బ్రిడ్జి పై నుండి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం పెరిగితే వాహనాల రాకపోకలను నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు, రేపు భారీ వర్షాలు అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కి 1700 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఇక హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 1500 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news