Jitta Balakrishna Reddy passes away: గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణించారు. గత కొన్ని రోజులుగా… తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిన… జిట్టా బాలకృష్ణారెడ్డి… ఇవాళ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని… వైద్యులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే… వెంటిలేటర్ పైన ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు. ఈ విషయాన్ని తాజాగా కుటుంబ సభ్యులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఆయన స్వగ్రామమైన భువనగిరికి జిటా బాలకృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు తీసుకు వెళుతున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయన అంతక్రియలు జరగనున్నాయి. ఇక జిట్టా బాలకృష్ణ మృతి పట్ల గులాబీ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.