వరంగల్ జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ మేళాను ప్రారంభించారు. ఈ మేళాకు భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు.
వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు నగరవ్యాప్తంగా యువతతో పాటు ఇతర నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ తొక్కిసలాటలో హోటల్ ప్రధాన ద్వారం దగ్గర అద్దం ధ్వంసం అయింది.