చర్మం యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పద్దతి ను ప్రయత్నించాల్సిందే..!

-

సహజంగా ఆడవాళ్లు చర్మ సౌందర్యానికి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందమైన మరియు కాంతివంతమైన చర్మం కోసం ఫేషియల్స్ వంటివి చేసుకుంటారు. దీంతో పార్లర్లకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ఎన్నో రసాయనాలు ఉపయోగించినా క్రీములను మరియు లోషన్లను వాడుతూ ఉంటారు. అయితే ఇంత ఖర్చు చేయకుండా అటువంటి ఫలితాలు రావాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఫేషియల్ స్టీమింగ్ చేయడం వలన చర్మం ఎంతో సౌందర్యంగా మారుతుంది. ఫేషియల్ స్టీమింగ్ అంటే ముఖానికి ఆవిరి పట్టడం.

ఇలా చేయడం వలన చర్మం ఎంతో శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తప్రసరణ బాగా జరగడం వలన అందమైన చర్మాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే ముఖానికి ఆవిరి పడతారో సహజమైన సౌందర్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా చర్మం ఎంతో తేలికగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ చేయడం వలన చర్మపు రంద్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మం లోపల ఉండేటువంటి మట్టి, మురికి నూనెలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాకుండా మృత కణాలు కూడా తగ్గిపోతాయి. దీంతో చర్మ ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. పైగా యవ్వనంగా కనబడతారు.

ముఖానికి తరచుగా ఆవిరి పట్టడం వలన మొటిమలు, నల్ల మచ్చలు వంటివి తగ్గుతాయి. చర్మ రంధ్రాల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది. దీంతో మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి లేకుండా ఎంతో ఆరోగ్యమైన చర్మాన్ని పొందుతారు. ముఖానికి ఆవిరి పట్టడం వలన చర్మం లో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన చర్మం ఎంతో మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎంతో యవ్వనంగా ముడుతలు లేకుండా కనిపిస్తారు. కనుక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ఎంతో అందంగా కనిపించాలంటే తప్పకుండా ఫేషియల్ స్టీమింగ్ ను ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news