15 సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనుకబదిందని దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి నన్ను గెలిపించాలని కొరాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత స్టేషన్ ఘనపూర్ మళ్ళీ అభివృద్ధి జరగదని నేను అనుకుంటే నాకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కి రావాలని కోరారు అని కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కావ్యాకు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో నన్ను కావ్యను సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు దూషించారు.
అయితే నియోజకవర్గ అభివృద్ధి కి 750కోట్లు నిధులు సిఎం కేటాయించారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. లీడర్ అనే నాయకుడు గ్రామాల్లో ఉంటూ గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామ స్థాయిలో ఉంటేనే టికెట్.. లేదంటే.. నన్ను కలిసిన ప్రయోజనం ఉండదు అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.