కాలేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ దగ్గర..ఓ పిల్లర్ సాంకేతిక సమస్య వచ్చినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు అన్నారం సర్వస్వతికి గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అన్నారం సరస్వతి బ్యారేజీ కి లీకేజీలు చోటు చేసుకున్నట్లు సమాచారం. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో వాటర్ ఉబికి వస్తున్నట్లు సమాచారం.
దీంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు, ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 5.71 టిఎంసీలు ఉన్న వాటర్, ఒక గేటు ఎత్తి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు అన్నారం సరస్వతి బ్యారేజ్. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం రేపడంతో…బీఆర్‌పార్టీకి టెన్షన్ మొదలైంది.