చార్మినార్ పై కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ..కేసు నమోదు

-

నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఆమె ఫ్లెక్సీని చార్మినార్ పై ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది.

చారిత్రక కట్టడం పై ప్లెక్సీలు ఆవిష్కరించడం నిబంధనలకు విరుద్ధమని చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై కేసు బుక్ చేశారు. ఫ్లెక్సీ కట్టిన టిఆర్ఎస్ నేతలు పుప్పాల రాధాకృష్ణ మరియు విజయ్ కుమార్ తో పాటు మరో నాయకుడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది ఇలా ఉండగా… టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ చెందిన చిన్ను గౌడ్ అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version