నా సినిమాలు, నాకే పోటీ..స్పీకర్లే పగిలిపోయాయి – నందమూరి బాల‌కృష్ణ‌

-

నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన అఖండ మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అఖండ సినిమా 20 థియేటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నిన్న కర్నూలు జిల్లాలో…అఖండ శతది నోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నందమూరీ బాలయ్య మాట్లాడుతూ… సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని అన్ని ప్రభుత్వాలను కోరుతున్నామని.. అఖండ శతదినోత్సవంలో పేర్కొన్నారు. కరోనాను లెక్క చేయకుండా జాగ్రతపడుతూ షూటింగ్ చేశాం, చలనచిత్ర పరిశ్రమకు అఖండ సినిమా ద్వారా ప్రేక్షకులు ఊపిరి పోశారని చెప్పారు నందమూరి బాలకృష్ణ.

నా సినిమాలు.. నాకే పోటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా హైందవ సనాతన ధర్మాన్ని గుర్తు చేసే విధంగా ఉంది…అఖండ సినిమా మంచి సందేశాన్ని అందించిందన్నారు. అఖండ సినిమాతో అమెరికాలో థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయాయని.. మా సినిమాలు మాకు పోటీ….ఇంకా మంచి వస్తాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version