మల్లికార్జున ఖర్గేకు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ

-

మల్లికార్జున ఖర్గేకు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు నమ్మి మీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ నాడు తెలంగాణ విద్యార్థినుల యొక్క చావులతో సహా అనేక అంశాలను అనవసరంగా రాజకీయం చేసి విద్యార్థుల్లో భయాందోళనను కల్పించి ఓట్లు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక శైలిని అవలంభించింది. అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కలను తుంగలో తొక్కుతోందని ఫైర్‌ అయ్యారు.

1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబరు 41, 56 జారీ అయ్యాయని తెలిపారు. దీనికి 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోందన్నారు కవిత. మహిళలకు అవకాశాలు లేక, విద్యా ప్రమాణాలు అందుకోలేక కొన్ని సంవత్సరాల పాటు కోల్పోయినప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో మీ గ్యారెంటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకురావడం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news