ఇసుక మాఫియాకు అడ్డగా మారిన కరీంనగర్‌ జిల్లా..లోకల్‌ లీడర్లే సూత్రధారులు..!

-

కరీంనగర్‌ జిల్లా శాండ్ మాఫియాకు అడ్డగా మారింది..తెలంగాణలో కడుతున్న కొత్త ప్రాజెక్టులకు అధిక మొత్తం ఇసుక అవసరం ఏర్పంది..ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంకు శాండ్ ఎక్కువ అవరం ఉంది..ఇదే అదునుగా చేసుకొన్న ఇసుకాసురులు..లోకల్ లీడర్లతో దందా మొదలుపెట్టారు..ఇసుక మాఫియాలో వారు ఆరితేరిపోయారు.. ఎక్కడికక్కడ డంప్‌లు పెట్టుకున్నారు..వందల్లో జేసీబీలు,లారీలు, ట్రాక్టర్లతో తోడేస్తున్నారు..డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కోట్లు కూడేసుకుంటున్నారు..చివరకు వల్లకాడులో ఉన్న ఇసుకును కూడా వదలడం లేదు.తెలంగాణలో ఏర్పాటు చేసిన టీఎస్ఎండిసి ఇసుక రీచ్‌లు ప్రజా అవసరాలను తీర్చలేకపోతుంది.. దీన్ని ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతోంది..లారీ ఇసుక 50వేలు, ట్రాక్టర్‌ లోడు పదివేలకు అమ్ముతూ జనాన్ని దోచేస్తోంది..ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 13నియోజకవర్గాలు ఇసుక మాఫియాకు కేరాఫ్‌ గా మారాయి.. ఇక్కడ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి..దీంతో కొరత రావడంతో మాఫియాకు కలిసొచ్చింది..ఇప్పటికే పెద్ద ఎత్తున సీక్రెట్‌గా డంప్‌ చేసిన ఇసుకను బయటకు తీస్తోంది..రేట్లను అమాంతంగా పెంచి..అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు..ఇక్కడ మరో విషయం ఏంటంటే లోకల్‌ లీడర్లే ఈ తతంగానికి ప్రధాన సూత్రధారులన్నది టాక్‌.

లేటెస్ట్‌ విషయం ఏంటంటే..రామడగులో శాండ్‌ మాఫియా స్మశానాన్ని కూడా వదల్లేదు. అర్థరాత్రి వేళ వాగునుంచి ఇసుకను తవ్వుకుపోయారు. ఇదే క్రమంలో స్మశానంలోని నాలుగు మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇంతకన్నా మరో దారుణం ఉంటుందా?.శవాలు బయడపడడం కలకలం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగారు..దీనిపై ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని వాగుల్లోకూ భారీగా వరద వచ్చింది దీంతో ఇసుకకు ఎక్కడలేని డిమాండ్‌ వచ్చింది. కొన్ని చోట్ల నీళ్లలోనుంచి కూడా ఇసుకను తోడేస్తున్నారు. ఇటు కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. అక్రమ తవ్వకాలతో ఇటు తాగునీటి సమస్యలు కూడా వస్తున్నాయి..ట్విస్టేంటంటే…ఈ దందా మొత్తం నేతలే వెనక ఉండి నడిపించడం..! దీంతో అధికారులు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారన్నది పబ్లిక్‌ టాక్‌. ప్రజా ప్రతినిధులే ఇసుకాసురుల అవతారం ఎత్తితే.. ఇక ఏముంది? దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు? అంటున్నారు జిల్లా ప్రజలు..

వచ్చేది ఎండకాలం కావడంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోవచ్చు..అధిక మొత్తంలో తవ్వకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి..దాంతో ఎండకాలంలో తాగునీటి ఎద్దడి వస్తుందంటున్నారు భూ గర్భశాస్త్రవేత్తలు..ఎక్కువ మొత్తంలో ఇసుక తవ్వడంతో పంట భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..వెంటనే ప్రభుత్వం ఇసుక దందాను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news