Karimnagar Lower Maneru Dam gates were lifted: కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయం నిండు కుండలా మారింది. దీంతో లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. ఎగువ నుంచి వరద కాల్వ, మధ్య మానేరు నుంచి వరద ప్రవాహం విపరీతంగా వస్తోంది. దీంతో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు.

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు ఎస్సారెస్పీ అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారింది ఎల్ఎండి జలాశయం. అటు మానేరు పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.