Golla Babu Rao about visakha steel plant: రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో నేను కేంద్ర మంత్రిని అడిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యటానికి కేంద్రం సిద్ధంగా వున్నారని బాంబ్ పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలని… విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎంఎల్ఏ, ఎంపీ లు రాజీనామా చేస్తా అంటున్నారన్నారు.
రాజీనామాలు అవసరం లేదు, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెప్తే చాలు అన్నారు. కూటమి సపోర్ట్ వల్లే కేంద్రంలో అధికారం వున్న మోడీ ప్రభుత్వం… విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటోందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు… విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యానివ్వమని హామి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆపటానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహించారు.