దూసుకు వెళ్తున్న కెసిఆర్… ఇవాళ బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే

-

కేసీఆర్ పోరుబాట కొనసాగుతోంది. BRS పార్టీ అధినేత కేసీఆర్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకారం…కరీంనగర్ లో రోడ్‌ షో ఉంటుంది. BRS కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బి. వినోద్ కుమార్ గారికి మద్దతుగా..BRS పార్టీ అధినేత కేసీఆర్ రోడ్‌ షోలో పాల్గొంటారు. కరీంనగర్ లో ఇవాళ రాత్రి 7:00 PM రోడ్ షో ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

KCR Back on Campaign Trail Today

కాగా బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ వయసును ప్రశ్నించాడు ఓ బుడ్డోడు. బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్ లో పిలల్లతో కేసీఆర్ సరదా సంభాషణలో మీరు ఎప్పుడు పుట్టారూ అని కేసీఆర్ ను ప్రశ్నించారు చిన్నోడు. మీకు 30 ఏళ్ళు ఉంటాయా అని ఆ బుడ్డోడు అనడంతో నవ్వారు కేసీఆర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news