సాధారణంగా ఏ పండు అయినా తియ్యగానే ఉంటుంది. తియ్యగా ఉన్న పండ్లు అన్నీ షుగర్ పేషెంట్స్ తినకూడదు అని లేదు. నిజానికి షుగర్ పేషెంట్లకు పండ్లే మంచి ఆహారం.. వీళ్లు సరిగ్గా ఏం పండు తినాలి, ఏది తినొద్దు అని తెలుసుకుంటే చాలు. డయాబెటిక్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినవచ్చు.
డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండ్లను తినవచ్చా లేదా అని సందేహం చాలా మందికి ఉంటుంది. అసలే ఇది మామిడిపండ్ల సీజన్.. మార్కెట్‌లోకి రసాలు, బంగినపల్లి కాయాలు వచ్చేశాయి. మామిడి పండులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కానీ మామిడిలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు, తీపి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మామిడిపండ్లను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.
డయాబెటిక్ పేషెంట్లు వీలైనంత వరకు మామిడిపండు తినకుండా ఉండాలి. అయితే డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండ్లను తక్కువ మోతాదులో తీసుకుంటే తప్పేమీ లేదు. మధుమేహ రోగులు దూరంగా ఉండవలసిన ఇతర పండ్లు
అరటిపండ్లు, పైనాపిల్స్ వంటి పండ్లలో చక్కెర పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, డయాబెటిక్ పేషెంట్లు వాటిని మితమైన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినదగిన కొన్ని పండ్లు.. యాపిల్స్, నారింజ, నిమ్మ, దానిమ్మ, చెర్రీస్, పీచెస్, కివీస్ తినవచ్చు.