కేసీఆర్ కుటుంబం ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తోంది – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ కుటుంబం ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ లోని కాచిగూడ లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకే వ్యూహాత్మకంగా ఆర్టీసీని దివాలా తీయిస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఆస్తులను బిఆర్ఎస్ నేతలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని.. కార్మికులందరూ తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపి కేసిఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరో ఐదు నెలలలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక గూటి పక్షులేనని.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్లేనని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news