కేసీఆర్ దూకుడు..మరో ఆయుధం దొరికినట్లే!

-

మూడోసారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చారు..ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో తెలంగాణలో గెలవడం అంత సులువు కాదు. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బి‌జే‌పి..బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. కానీ ఇలాంటి సమయంలోనే కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.

రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయేలా చేసి..తమకు లబ్ది జరిగేలా చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు బి‌జే‌పి బలపడటం బి‌ఆర్‌ఎస్ పార్టీకే ప్లస్ అనే చెప్పాలి. ఆ వ్యూహంతోనే కే‌సి‌ఆర్..జాతీయ రాజకీయాల కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. కేంద్రంలోని బి‌జే‌పిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు.అంటే అలా కేంద్రాన్ని రాజకీయ శత్రువుని చేసి..కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్లు చూపించి..రాష్ట్రంలో లబ్ది పొందాలనేది కే‌సి‌ఆర్ క్లియర్ కాన్సెప్ట్ అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ దిశగానే కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే కే‌సి‌ఆర్ కు ఓ ఆయుధం దొరికింది. రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై లోక్ సభ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేతపై వేటు వేయడాన్ని దేశంలోని అన్నీ విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేవలం ఇది రాజకీయ కక్షలో భాగంగానే జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

అయితే రాజకీయ పరిస్తితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి..కావాలని రాహుల్ ని బి‌జే‌పి టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో మోదీ ఇంటి పేరు ఉన్నవాళ్ళంతా దొంగలు అన్నట్లు గతంలో ఎప్పుడో మాట్లాడిన మతలపై..ఇప్పుడు గుజరాత్  మంత్రి పరువు నష్టం దావా వేయడం..సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం, వెంటనే బెయిల్ ఇచ్చి..నెల రోజుల లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వడం చేసింది. కానీ ఈ లోపే ఆయన ఎంపీ పదవిపై వేటు వేయడం..బి‌జే‌పి కక్షపూరిత చర్య అని కే‌సి‌ఆర్ ఫైర్ అవుతున్నారు. మళ్ళీ విపక్షాలని ఏకం చేసి బి‌జే‌పిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version