సూర్యాపేట పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్‌

-

సూర్యాపేట పంట పొలాలను పరిశీలించారు కేసీఆర్‌. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR inspected the crop fields in Suryapet

అటు సూర్యాపేట జిల్లాలోని మరో ప్రాంతంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి.. రైతులకు భరోసా కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాగా పొలం ఎండిపోయింది, కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR inspected the crop fields in Suryapet

నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఈరోజు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news