తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దే : బీర్ల ఐలయ్య

-

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ టూర్లో కేసీఆర్ సాగు నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించడంతో పాటు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. జిల్లాలో పర్యటనలో భాగంగా కేసీఆర్ ఆదివారం నల్లగొండ, జనగాం, సూర్యపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కేసీఆర్ జిల్లాల టూర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్ కి రైతులు వాళ్ల కష్టాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు.

వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గంగలో కలిపి తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆరేనని విమర్శించారు. అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ రైతులకు దగ్గరకు పోతున్నారని ప్రశ్నించారు. వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేవన్నారు. సాగు నీరు లేక తెలంగాణలో అక్కడక్కడ పంటలు ఎండిన మాట వాస్తవమేనని అన్నారు. సాగు నీరులేక పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిలయ్య స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news