కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. 37 సంవత్సరాలు ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కాసేపటి క్రితం మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. దీంతో గులాబీ పార్టీలో తీవ్ర విశాద చాయాలు అలుముకున్నాయి. కాగా కంటైన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి… సాయన్న గత ఏడాది చనిపోయాడు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన లాస్య నందిత కూడా మరణించారు.