బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కోడంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ప్రియాంక గాంధీ హాజరై మాట్లాడారు. కెసిఆర్ 10 ఏళ్ల పాలన అవినీతి మాయమని కేసీఆర్ హయాంలో స్కాముల మీద స్కాములు ఆరోపించారు. టిఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టుల్లో భారీగా దోపిడీ జరిగిందని నిప్పులు చెరిగారు. దొరల తెలంగాణ రోజురోజుకీ బలపడుతోంది. ప్రజల తెలంగాణ మాత్రం బలహీన పడుతుందని మండిపడ్డారు.
దేశంలో పాదాల గురించి పాల చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని టిఆర్ఎస్ మాత్రం ధనవంతుల పార్టీగా మారిందని ఒంటి కాలిపై లేచారు. బిజెపి బిఆర్ఎస్ రెండు ఒకటేనని టిఆర్ఎస్కు బిజెపికి సహకారం అందిస్తూనే ఉంది అన్నారు. మీ ఆశలు నెరవేర్చేందుకే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ ఏర్పడితే మన ప్రభుత్వం వస్తుందని అంతా భావించారు. కానీ ప్రజలు టిఆర్ఎస్కు పట్టం కట్టారు. ఈసారైనా కాంగ్రెస్ని గెలిపించాలని కోరంగల్ ఎన్నికల ప్రచార సభలో కోరారు ప్రియాంక గాంధీ.