ఆ భూమి ప్రభుత్వానిదేనని కేసీఆర్ కు తెలుసు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

-

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ సర్వే నెం.25లో గల 400 ఎకరాల భూమి పై ప్రస్తుతం రాద్దాంతం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని.. వేలం వేయడాన్ని ఆపాలని HCU విద్యార్థులు ఆందోళనకు దిగారు. వాస్తవానికి ఆ భూములు పక్కాగా ప్రభుత్వానివే సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

కంచ గచ్చిబౌళి భూమి ప్రభుత్వానిదేనని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుల్లోనూ కొట్లాడిందని.. ఇప్పుడు HCU భూమి అని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రానికి లక్సల కోట్ల అప్పులున్నాయి. రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. సంక్సేమ పథకాలు సక్రమంగా నడవాలంటే కొన్ని భూములు అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూమి వేలం వేస్తే ఆదాయం వస్తుంది. కొన్ని భూములు అమ్మి పథకాలు ఇస్తారేమో అని కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news