విపక్షాలతో కలిసి పోరాడతాం.. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​దే విజయం : కేసీఆర్

-

కేంద్ర సర్కార్ తనపైనా.. తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపైనా కక్ష సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ.. పార్టీ మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ఎత్తులను చిత్తు చేద్దామని పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. న్యాయపరంగా పోరాడదామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర వైఖరిపై.. మోదీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. విపక్షాలను కూడగట్టుకుని పోరాడదామని కేసీఆర్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని.. తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్న సీఎం…ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు. ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మంత్రులు అభివృద్ధిపై దృష్టిసారించాలని,తమ తమ జిల్లాల్లో పెద్దన్నపాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతంపైనా దృష్టి సారించాలని చెప్పారు. బీజేపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version