నేటి నుంచి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటన

-

బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మార్చడానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భవించిన రోజు నుంచి మరాఠా సామ్రాజ్యంలో ప్రవేశించిన పార్టీ.. అంచెలంచెలుగా అక్కడ ఎదగడానికి.. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరించడానికి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ నేటి నుంచి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఈరోజు ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ బయల్దేరతారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్​ఎస్ నేతలు భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి మహారాష్ట్ర చేరుకోనున్న కేసీఆర్.. రాత్రి అక్కడే బస చేస్తారు. సోలాపూర్‌ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news