తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

-

గత రెండ్రోజులుగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ప్రజలంతా ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వానలు కురుస్తుండటంతో రైతులు వానా కాలం పంట సాగుపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

శనివారం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు సమీపంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం అల్ప పీడనంగా మారినట్లు సూచించింది. మరోవైపు శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వానలు కురుస్తున్నాయి. మెదక్‌ జిల్లా కౌడిపల్లి, రామాయంపేటలో 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేటలో 5, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, రాయికోడ్‌లో 5, నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 5 సెం.మీటర్లు కురిసింది. ఆదివారం పగలు కూడా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో 3.5 సెం.మీటర్లపైన వర్షాలు కురిశాయి.

Read more RELATED
Recommended to you

Latest news