BRS నేతలకు KCR కీలక ఆదేశాలు…ఇక కాంగ్రెస్ కు చుక్కలే !

-

కృష్ణా నదీ జలా పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ..brs ఫైర్ అయింది.

kcr meeting with leaders

కేఆర్ఎంబికి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందుబాటులోవున్న పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ,  సత్యవతి రాథోడ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news