బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది: కేసీఆర్‌

-

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ హైదరాబాద్ నందినగర్‌లో కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన ప్రవీణ్ కుమార్ దాదాపు రెండు గంటలపాటు పొత్తు అంశంపై చర్చించారు. ఈ భేటీ అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కేసీఆర్‌, ప్రవీణ్‌ కుమార్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, ప్రవీణ్ కుమార్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వారు పొత్తు విధివిధానాలు వివరించనున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల వరుసగా నాయకులు గుడ్ బై చెబుతుండటం.. ముఖ్యంగా కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో పార్టీ గందరగోళానికి గురవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీతో పొత్తుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై కేసీఆర్, ప్రవీణ్ కుమార్ క్లారిటీ మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news