సోయిలేనితనంతో తెలంగాణ మొదట్నుంచీ ఆగమైంది : కేసీఆర్‌

-

సోయిలేనితనం కారణంగా తెలంగాణ మొదట్నుంచీ ఆగమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యాన్ని నింపటానికి కవులు, రచయితలు ముందుండాలని కోరారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న . తన కవిత్వానికి సంబంధించి పుస్తకాలను కేసీఆర్కు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో నదీజలాల వాటాను సాధించుకోవడంలో తెలంగాణ నాయకత్వం నిర్లక్ష్య ధోరణి, ఆంధ్రా నాయకత్వం స్వార్థంతో  వ్యవహరించినట్లు కేసీఆర్ ఆరోపించారు. విద్యుత్, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రానికి ఉద్దేశపూరితంగా జరిగిన ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వం విఫలమైందని ఆరోపించారు. వారి వైఫల్యమే తెలంగాణ రైతులకు తీరని శాపంగా మారిందని కేసీఆర్ విమర్శించారు.

మరోవైపు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ ప్రపంచ నాయకత్వానికి దీటుగా శాంతియుత పద్ధతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందని అన్నారు. ఆయన పదేళ్ల పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి పథంలో సాగాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news