ఓసీల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఓసీల సంఖ్యను ఎక్కువగా చూపారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్వేలో 21 శాతం ఓసీలు ఉంటే తమ సర్వేలో 17 శాతమే ఉన్నట్టు తేలిందన్నారు. ప్రజా భవన్ లో సీఎం మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు సర్వేలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. మేము ముస్లింలను బీసీలలో కలిపితే బండి సంజయ్ ఎలా ప్రశ్నిస్తారు. గుజరాత్ లో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చింది కనబడలేదా..? అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు. బీసీల సంఖ్య పై గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారు. కానీ మేము అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించామని తెలిపారు. ఇంటి యజమాని చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news