తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 5వ తేదీన పిసి గోష్ కమిషన్ ముందు… విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. ఈ మేరకు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాలేశ్వరం పై చాలా దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… స్వయంగా తానే అసలు వాస్తవాలు చెప్పాలని రంగంలోకి దిగుతున్నారట కేసీఆర్. ఇక ఇదే విషయం పైన… హరీష్ రావు అలాగే ఈటల రాజేందర్ లకు కూడా నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. కెసిఆర్ హాజరైన తర్వాత… ఈ ఇద్దరు నాయకులు విచారణకు హాజరవుతారు.