ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

-

ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఎప్పుడైతే మంచి పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటారో మరియు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుంటారో, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. సహజంగా ఆహారాన్ని ప్రతి ఒక్కరూ పొట్ట నింపుకోవడానికి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే పోషక విలువలు గురించి ఆలోచించరు. పైగా, ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు మరియు ఏ సమయంలో తీసుకుంటారో అనే దాని గురించి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి అంశాలు ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతాయి అని నిపుణులు చెప్తున్నారు.

మంచి ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటుగా సరైన సమయానికి తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, రోజుకు రెండు సార్లు భోజనం చేయడం ఎంతో ఆరోగ్యకరం. అందుకే ఒకసారి భోజనం చేసే వారు యోగులు, రెండుసార్లు చేసేవారు బోగిలు మరియు మూడు సార్లు భోజనం చేసేవారు రోగులు అని చెప్పడం జరిగింది. కనుక, ప్రతిరోజు రెండుసార్లు భోజనాన్ని చేయడం ఎంతో అవసరం మరియు ఇది ఎంతో ఆరోగ్యకరం. ఉదయం 10 నుండి 12 గంటల మధ్యలో మొదటి భోజనాన్ని తినడం మరియు రెండవ భోజనాన్ని సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య తినడం ఎంతో ఆరోగ్యకరం అనే చెప్పవచ్చు.

పైగా ఆకలిగా అనిపించినప్పుడు మరియు ఎక్కువ శారీరక శ్రమ తీసుకున్నప్పుడు, భోజనం మధ్యలో పండ్లు, సూప్, మజ్జిగ వంటి తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవడం మేలు. ఉదయం 10 గంటలకు తీసుకునేటువంటి ఆహారంలో పూర్తిగా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే సాయంత్రం తీసుకునేటువంటి ఆహారం లో భాగంగా తేలికపాటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. దీన్ని పాటిస్తే, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కనుక ఆహారపు అలవాట్లను మార్చుకుని ఆరోగ్యాంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news