పాలిష్ బండలపై నడవకండి అంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై రాములమ్మ సెటైర్లు పేల్చారు. మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోలుకుంటున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, ఆయన మానసికంగా కూడా దృఢంగా ఉన్నారని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో, చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు.
అయితే.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే.. కేసీఆర్ నడకపై విజయశాంతి సెటైర్లు వేశారు. ఈ లెక్కనుండే పాలిష్ బండలు కాళ్లు నడవనీకి ఎన్నడైనా ప్రమాదమే.. కేసీఆర్ గారికే కాదు, ప్రజలందరికీ అంటూ ఎద్దేవా చేశారు. పైసలు ఖర్చు చేసి, గొప్పతనాలకు పోయి, ఇలాంటి సమస్య తెచ్చుకునేకన్నా.. గరుకు రాళ్లు, గట్టి నేలపై నడిచే నడకలు ఎప్పుడైనా మంచే మరి.. అందరికీ ఎన్నడైనా అంటూ అర్థం కానీ పోస్ట్ పెట్టారు విజయశాంతి.