KCR: కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకి వచ్చి వివరిస్తానని తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనా వచ్చినా నేను రైతుబంధు ఆపలేదు.. ఈరోజు రైతుబంధు వెయ్యడానికి కూడా చాతనైతలేదా? అంటూ రేవంత్ ను విమర్శించారు కేసీఆర్.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ 300కు పైగా పిల్లర్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు.
దేశమే కొట్టుకుపోయినట్లు మాట్లాడుతు న్నారు. రెండు కుంగితే భూమి బద్దలైందా..? అని ప్రశ్నించారు.మేడిగడ్డ పేరు చెప్పి నన్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో టీవీల్లో కూర్చుని కాళేశ్వరంపై వివరిస్తా’ అని కేసిఆర్ పేర్కొన్నారు.