రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని అన్నారు. హైదరాబాద్ హస్తినాపురంలో లబ్ధిదారులకు కన్వీనియన్స్ డీడ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆగస్టు 15 నుంచి అక్టోబరు లోగా నియోజకవర్గానికి 4 వేల చొప్పున రెండు పడకల గదులు ఇళ్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.
మరోవైపు గృహ లక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల కుటుంబాలకు.. 3 లక్షల సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ప్రజల అవసరాల దృష్ట్యా ఇప్పటికే 70 కి.మీ. మెట్రో రైలు మార్గం పూర్తయ్యిందని… అతి తక్కువ ఖర్చుతో బాహ్యవలయం చుట్టూ 159 కి.మీ. మెట్రో రూట్‌కు ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపారు. భూసేకరణ పూర్తి చేసి… మెత్తం 314 కి.మీ. మెట్రో మార్గాన్ని 4 ఏళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.